Pocharam: బాన్సువాడలో విజయం.. ఆనవాయితీకి అడ్డుకట్ట వేసిన పోచారం

నిజామబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. 

Updated : 03 Dec 2023 17:36 IST

బాన్సువాడ: నిజామబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న ఆయన బాన్సువాడ నుంచి గెలుపొంది గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. గతంలో స్పీకర్‌గా పనిచేసిన వారు.. తదుపరి ఎన్నికల్లో గెలుపొందిన సందర్భాలు లేవు. తాజాగా పోచారం గెలుపొంది.. ఆ ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు.

గతంలో స్పీకర్‌గా పనిచేసిన మధుసూదనాచారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాదెండ్ల మనోహర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, ప్రతిభా భారతి తదితరులు ఓటమి చవిచూశారు. దీంతో 2018లో భారాస అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పదవి చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో కేసీఆర్‌.. పోచారం శ్రీనివాసరెడ్డిని ఒప్పించి సభాపతిగా నియమించారు. ప్రస్తుతం పోచారం గెలుపుతో పాత ఆనవాయితీకి అడ్డుకట్ట వేసినట్లయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు