Poll panel: డీఎంకే నేత వాహనాలను తనిఖీ చేయనందుకు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌పై వేటు

డీఎంకే అభ్యర్థి ఏ.రాజా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయనందుకు తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ హెడ్‌ను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది.

Updated : 31 Mar 2024 13:13 IST

చెన్నై: డీఎంకే అభ్యర్థి ఏ.రాజా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయనందుకు తమిళనాడులోని నీలగిరి జిల్లా ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ హెడ్‌పై వేటు పడింది. ఆయనను ఎన్నికల సంఘం సస్పెండ్‌ చేసింది. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం కూనూరు సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రాజాకు సంబంధించిన వాహనాలను అధికారులు తనిఖీ చేయలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్కడ రికార్డు చేసిన వీడియోలను ఈసీ అధికారులు పరిశీలించారు. ఇందులో అధికారుల అలసత్వం కనిపించడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ హెడ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు.. ఆ టీమ్‌ మొత్తాన్ని మార్చేసింది.

నీలగిరి లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌  ఏప్రిల్‌ 19న జరగనుంది. ఈ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి ఏ.రాజా పోటీ చేస్తుండగా.. భాజపా నుంచి కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ బరిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని