Prashant Kishor: ఆ రోజు గొంతు తడారకుండా.. నీళ్లు దగ్గర పెట్టుకోండి: ప్రశాంత్‌ కిశోర్ పోస్టు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్ (Prashant Kishor) ఇప్పటికే తన అంచనాలు వెల్లడించారు. ఈ క్రమంలోనే తనను విమర్శించేవారిని ఉద్దేశించి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 

Updated : 23 May 2024 18:26 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 300లకు పైగా సీట్లు సాధిస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిశోర్ (Prashant Kishor) అంచనా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. అలాగే నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. ‘‘జూన్‌ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి’’ అని ఎద్దేవా చేశారు. ఆరోజున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. ప్రశాంత్‌ కిశోర్‌ గతంలో చేసిన కొన్ని అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుకు, కిశోర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వీడియో వైరల్‌ అయిన కొద్దిసేపటికే ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టడం గమనార్హం. 2021లో వెస్ట్‌ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసిన అంచనా నిజమైందని ఈసందర్భంగా గుర్తుచేశారు. ఇదిలాఉంటే.. ఎన్డీయే 400 మార్క్‌ దాటుతుందని మోదీ చేస్తోన్న ప్రచారంపై ఓ మీడియా సంస్థతో ప్రశాంత్‌ మాట్లాడుతూ.. అది సాధ్యం కాదన్నారు. అలాగే 270 కంటే దిగువకు కూడా పడిపోదని వెల్లడించారు. తూర్పు, దక్షిణ భారతంలోనూ ఆ పార్టీ సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. భాజపాను అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని.. కానీ, బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు