Chandrababu: తెదేపా-జనసేన సునామీలో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Published : 10 Jan 2024 19:25 IST

తుని: జగన్‌ అహంకారమే అతన్ని ముంచేసిందని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన  ‘రా..కదలిరా’ సభలో ఆయన మాట్లాడారు. వచ్చే 3నెలల్లో తెదేపా-జనసేన సునామీలో వైకాపా కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ని తప్పకుండా అమలు చేస్తానని ప్రకటించారు. తెలుగు జాతి, స్వర్ణయుగం కోసం కదలిరావాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే పేదలు, రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం తెదేపా-జనసేన మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. జీవితంలో ఇంకెప్పుడూ జగన్‌ గెలిచే అవకాశం లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయం మారిందని, సైకో జగన్‌.. ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. 

‘‘కల్తీ మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. ఐదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చిందా?మూడు నెలల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. వైకాపాను చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలపాలి. జగన్‌ రాతి యుగం పోవాలి.. తెదేపా-జనసేన స్వర్ణయుగం రావాలి. మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత నాది. కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటాను. వెనకబడిన వర్గాలకు సమర్థ నాయకత్వం ఇచ్చిన పార్టీ తెదేపా. వారి కోసం జయహో బీసీ తీసుకొచ్చాం. అన్ని వర్గాలను గౌరవించే బాధ్యత తీసుకుంటాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెదేపా. తెలుగుజాతిని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత నాది. ప్రపంచంలో తెలుగుజాతి నంబర్‌ వన్‌గా ఉండాలనేదే నా సంకల్పం. పేదరికం లేని సమాజం చూడాలనే ఎన్టీఆర్‌ కలను సాకారం చేస్తాం. పేదరికం నుంచి ప్రతిఒక్కరూ బయటపడేలా చూస్తా’’ అని చంద్రబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు