Rahul Gandhi: వయనాడ్‌, రాయ్‌బరేలీ.. దేన్ని వదులుకుంటారు? రాహుల్‌ ఏమన్నారంటే..?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రెండుచోట్లా పోటీ చేసి.. రెండింటిలో విజయం సాధించారు.

Published : 04 Jun 2024 20:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అంచనాలకు మించి సీట్లు సాధించిన ఇండియా కూటమి ఉత్సాహం రెట్టింపైంది. మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీ చేసిన రెండుచోట్లా గెలుపొందడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచింది. వయనాడ్‌తోపాటు.. యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్‌ భారీ మెజార్జీతో విజయం సాధించారు. యూపీలోని కాంగ్రెస్‌ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో పోటీకి చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ.. అనుకున్న ఫలితం సాధించారు. దీంతో రాహుల్‌ ఇప్పుడు ఈ రెండు స్థానాల్లో ఒక దానిని వదులుకోవాల్సి ఉంటుంది.

ఈ రెండింటిలో ఏ స్థానంలో కొనసాగుతారు..? అని మీడియా ప్రశ్నించగా రాహుల్‌ స్పందించారు. ‘రెండు సీట్లలో కొనసాగటం కుదరదు. ఏదో ఒకటి వదులుకోవాలి. ఏ స్థానాన్ని వదులుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదు’ అని సమాధానమిచ్చారు.

2019 ఎన్నికల్లో యూపీలోని అమేఠీ స్థానంలో కేంద్ర మంత్రి స్మృతిఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్‌.. కేరళలోని వయనాడ్‌ నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీలో రాహుల్‌ పోటీ చేశారు. అమేఠీ, రాయ్‌బరేలీల్లో కాంగ్రెస్‌ గెలుపొంది.. తన కంచుకోటలను కాపాడుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు