Maharashtra: సీట్ల సర్దుబాటుపై అనిశ్చితి.. ఉద్ధవ్‌కు రాహుల్‌ ఫోన్‌..!

మహారాష్ట్ర(Maharashtra)లో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి పార్టీల మధ్య ఎనిమిది ఎంపీ సీట్ల విషయంలో చర్చలు ఒక కొలిక్కి రావాల్సిఉంది.

Updated : 23 Feb 2024 12:28 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌- ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పొత్తు ఓ పట్టాన కొలిక్కిరావడం లేదు. మహారాష్ట్ర(Maharashtra)లో శివసేన(యూబీటీ), శరద్‌పవార్‌ ఎన్సీపీ, హస్తం పార్టీ మధ్య ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.

మహారాష్ట్ర(Maharashtra)లో 48 ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాటిలో ఎనిమిది సీట్ల విషయంలో మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో చర్చలు ముందుకు సాగడం లేదు. దాంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi).. శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్ చేశారు. ఇద్దరి మధ్య గంటపాటు సంభాషణ జరిగింది. ముంబయిలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో మూడు చోట్ల నుంచి కాంగ్రెస్ పోటీ చేయాలనుకుంటోంది. మరోవైపు ఉద్ధవ్‌.. అక్కడి నుంచే నాలుగు సీట్లతో సహా మొత్తం 18 స్థానాలను ఆశిస్తున్నారు.

2019లో శివసేన(ఉద్దవ్‌+ శిందే వర్గం) 22 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దింపగా.. 18 మంది విజయం సాధించారు. వాటిలో ముంబయిలోని మూడు స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. సీట్ల సర్దుబాటుపై రాహుల్‌, శరద్‌ పవార్‌ ఇప్పటికే ఫోన్‌లో చర్చలు జరిపారు. ఎంవీఏ కూటమి లోక్‌సభ సీట్ల సర్దుబాటు చివరి దశకు చేరుకుందని కాంగ్రెస్ వెల్లడించింది. మరోవైపు.. కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య సీట్ల పంపిణీ చర్చలు తుది దశకు చేరినట్లు సమాచారం. దిల్లీతోపాటు హరియాణా, గుజరాత్‌, గోవాలలోనూ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని