Mallikarjun Kharge: మనసులో మాట బయటపెట్టిన మల్లికార్జున ఖర్గే

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన మనసులో మాటను బయటపెట్టారు. అగ్రనేత రాహుల్‌ గాంధీకి అండగా నిలిచారు.

Updated : 31 May 2024 20:06 IST

దిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తన మనసులో మాటను బయటపెట్టారు. అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul gandhi) అండగా నిలిచారు. భాజపాను (BJP) ఓడించి ఇండియా (INDIA) కూటమి అధికారంలోకి వస్తే.. ప్రధాని అభ్యర్థిగా తాను రాహుల్‌నే సమర్థిస్తానని చెప్పారు. ఈమేరకు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరోవైపు రాయ్‌బరేలీ స్థానాన్ని ప్రియాంక గాంధీకి కేటాయించాలని తాను ప్రతిపాదించినట్లు చెప్పారు.

రాహుల్‌గాంధీ ఇక్కడినుంచి పోటీ చేసేందుకు ముందుకురావడంతో ప్రియాంక తప్పుకొన్నారని తెలిపారు. ఈ స్థానం నుంచి సోనియాగాంధీ వరుసగా ఐదుసార్లు విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి రాహుల్‌ బరిలోకి దిగారు. మరోవైపు కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే.. అందులో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌కే ప్రధానమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఖర్గే తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీయేనని స్పష్టమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని