Rahul Gandhi: భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్‌ జోస్యం

కేంద్రంలోని భాజపాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. కాషాయ పార్టీ యూపీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అవుతుందన్నారు.

Published : 20 May 2024 00:01 IST

లఖ్‌నవూ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో భాజపా ఒక్క సీటు కంటే ఎక్కువ గెలవలేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) జోస్యం చెప్పారు. ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌.. భాజపాపై విమర్శలు గుప్పించారు.

‘‘కేంద్రంలోని భాజపా మరోసారి అధికారం చేజిక్కించుకుని భారత రాజ్యాంగంపై దాడి చేయాలని చూస్తోంది. ఏ శక్తికీ అది సాధ్యం కాదు. అలా ఎన్నటికీ జరగకుండా పోరాడతాం. జపాన్‌లోని క్యోటోలా వారణాసిని మారుస్తానని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఆ ఒక్క స్థానానికే భాజపా పరిమితమవుతుంది ’’ అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి అధికారంలోని వచ్చిన వెంటనే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై చట్టాన్ని తీసుకురానున్నామని తెలిపారు. దేశంలోని నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలిస్తామని హామీ ఇచ్చారు. అగ్నివీర్‌ పథకాన్ని తొలగించి.. గతంలో మాదిరిగా సాయుధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ కొనసాగిస్తామన్నారు.

మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్‌ రంజన్‌

మరోవైపు.. రేషన్‌ దుకాణాల ఎదుట ప్రధాని మోదీ చిత్రపటాన్ని ప్రదర్శించని కారణంగా పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం నిధులను నిలిపివేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు