Rahul Gandhi: సింగరేణి ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటాం: రాహుల్‌ గాంధీ

ఆరు గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.

Updated : 19 Oct 2023 17:46 IST

పెద్దపల్లి: ఆరు గ్యారెంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన విజయభేరి సభలో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు.

‘‘ఒక కుటుంబంతో ఉండే అనుబంధం నాకు తెలంగాణతో ఉంది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీకి తెలంగాణతో మంచి అనుబంధం ఉండేది. తెలంగాణ ఇస్తామని చెప్పిన హామీని సోనియాగాంధీ నెరవేర్చారు. రాజకీయంగా పార్టీకి నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ, రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. ధరణి పోర్టల్‌ వల్ల ఎవరికైనా మేలు జరిగిందా? ధరణి పోర్టల్‌ ద్వారా రికార్డులు మార్చి భూములు లాక్కోవాలని చూస్తున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎంతమందికి వచ్చాయి? రూ.లక్ష రుణమాఫీ ఎందరికి చేశారు? రైతు బంధు ద్వారా పెద్ద రైతులకే మేలు జరిగింది. సింగరేణి గనులను అదానికి అమ్మే ప్రయత్నం జరిగితే మేం అడ్డుపడ్డాం. సింగరేణి ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని హామీ ఇస్తున్నా’’ అని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. సభలో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌ నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని