నాతో చర్చకు మోదీ రారు: రాహుల్‌

ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్‌ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.

Published : 19 May 2024 02:55 IST

దిల్లీ: ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్‌ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. దిల్లీలో కాంగ్రెస్‌ శనివారం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో రాహుల్‌ ఈ మేరకు ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కీలక అంశాలపై బహిరంగ చర్చ జరపాలని ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ, రాహుల్‌లకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ మదన్‌ బి లోకుర్, జస్టిస్‌ అజిత్‌ పి షా, సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌ రామ్‌ ఇటీవల లేఖ రాశారు. వారి ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నట్లు రాహుల్‌ ఈ నెల 11న చెప్పారు. తనతో చర్చకు రావాలని మోదీని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని