రాహుల్ గాంధీ సహా ఎవరినైనా ఎదుర్కొంటా: నామా నాగేశ్వరరావు

శాసనసభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. 

Published : 04 Mar 2024 20:10 IST

హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ ఖమ్మం, మహబూబాబాద్ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ధీమా వ్యక్తం చేశారు. మరోమారు తమకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాతికేళ్లుగా ప్రజాసేవలో ఉన్నానని, ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ సహా ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటానని నామా వెల్లడించారు. గెలుపోటములు కాదు.. ప్రజాసేవ ముఖ్యమని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామన్న చర్చ ప్రజల్లో జరుగుతోందని కవిత పేర్కొన్నారు. రైతులకు కరెంటు, నీళ్ల సమస్య మళ్లీ మొదలైందన్నారు. గిరిజనులకు భారాస ఎంతో చేసిందని.. బయ్యారం ఉక్కు కర్మాగారం సహా చాలా వాటి కోసం లోక్‌సభలో కొట్లాడామని గుర్తుచేశారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనారోగ్యంతో సమావేశానికి రాలేదన్నారు. కాంగ్రెస్‌లో ఆయనకు అవకాశం రాలేదని, భారాసలో ఉండబట్టే ఎమ్మెల్యే అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. భారాస మాజీ ఎమ్మెల్యేలు, నేతలు అందరూ తనకు సహకారం అందిస్తారని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని