Revanth Reddy: ఆరు గ్యారంటీలపైనే రేవంత్‌ తొలి సంతకం

తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు.

Updated : 07 Dec 2023 15:34 IST

హైదరాబాద్‌: తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ (Congress) ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారంటీల దస్త్రంపైనే ఆయన తొలి సంతకం చేశారు. ఆ తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక ఉత్తర్వులపై రెండో సంతకం చేశారు.  

అప్పుడు హామీ ఇచ్చి.. ఇప్పుడు నెరవేర్చి..

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినీకి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. రిటైర్డు ఉద్యోగి అయిన వెంకటస్వామి, మంగమ్మ దంపతులకు మొదటి సంతానం రజిని. దివ్యాంగురాలైన ఆమె కష్టపడి పీజీ వరకు చదివింది. ఉన్నత చదువు పూర్తి చేసినా ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. గతంలో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని కలిసి ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని రజినీకి ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్‌.. నేడు ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని