Revanth Reddy: మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు.. పోరాడే సైనికులు: సీఎం రేవంత్‌రెడ్డి

తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు.

Updated : 07 Apr 2024 11:06 IST

హైదరాబాద్‌: తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ ఓ మహా సముద్రం.. అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బంధువులు. మా కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు. వాళ్లు త్యాగశీలురు, తెగించి కొట్లాడే వీరులు. జెండా మోసే బోయీలు మాత్రమే కాదు.. అజెండాలు నిర్ణయించే నాయకులు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్దమిది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని