CM Revanth: మేం గేట్లు తెరిస్తే భారాసలో ఎవరూ ఉండరు: రేవంత్‌రెడ్డి

భారాస, భాజపా ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 11 Mar 2024 18:03 IST

మణుగూరు: భారాస, భాజపా ఒక్కటై పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేం గేట్లు తెరిస్తే భారాసలో కేసీఆర్‌ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ‘ప్రజాదీవెన’ సభలో ఆయన మాట్లాడారు.

‘‘కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలే. ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించాం. ఈ ఇళ్లు పేదలకు దేవాలయాలు. వీటి నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వంలో హామీలను అమలు చేయకుండా కేసీఆర్‌ మోసం చేశారు. అందుకే ఖమ్మం జిల్లా ప్రజలు భారాసను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టారు’’ అని సీఎం రేవంత్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని