NDA: రాజ్యసభలో ఇక ఎన్‌డీయే హవా! ఏప్రిల్‌లో దాటనున్న మెజార్టీ మార్కు!

రాజ్యసభలోనూ ఎన్‌డీయే (NDA) కూటమి త్వరలో బలం పెంచుకోనుంది. ఇటీవల గెలిచిన స్థానాలతో పాటు నామినేటెడ్‌ పోస్టులతో మెజార్టీ మార్కు దాటనుంది.

Published : 28 Feb 2024 21:59 IST

దిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి రాజ్యసభలోనూ త్వరలో బలం పెంచుకోనుంది. ఇటీవల కొత్తగా ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు నామినేటెడ్‌ కేటగిరి కింద ఖాళీగా ఉన్న ఆరు స్థానాలు ఈ ఏప్రిల్‌లో భర్తీ కానున్నాయి. దీంతో ఎన్డీయే సభ్యుల సంఖ్య సగానికంటే ఎక్కువ కానుంది.

రాజ్యసభ సెక్రటేరియట్‌ ప్రకారం.. భాజపాకు ప్రస్తుతం 94 మంది సభ్యులున్నారు. మంగళవారం ముగిసిన ఎన్నికల్లో అదనంగా రెండు స్థానాల్లో గెలుపొందగా.. ఈ సంఖ్య 96కు చేరుకున్నట్లైంది. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు కాగా ఎన్‌డీయే కూటమికి 113 సభ్యుల బలముంది. ఏప్రిల్‌లో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఈ సంఖ్య సగం మార్కు (123) దాటనుంది. ఎగువ సభలో మొత్తం 12 నామినేటెడ్‌ సభ్యులుండగా.. రాష్ట్రపతి నామినేట్‌ చేసిన ఆరుగురు ఎంపీలు ప్రస్తుతం కొనసాగుతున్నారు. మరో ఆరుగురు చేరనుండటంతో భాజపా సంఖ్య పెరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని