Sajjala: జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆ ప్రచారంలో వాస్తవం లేదు: సజ్జల

ఏపీ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తుందనడంలో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు.

Updated : 05 Dec 2022 17:02 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తుందనడంలో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. పంచాయతీరాజ్‌ విభాగంలో ఉద్యోగులను తొలగిస్తూ ఉన్నతాధికారులు  ఆదేశాలిచ్చారని.. దీనిపై సీఎం జగన్‌ (CM Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపును ఉపసంహరించుకోవాలని సీఎం ఆదేశించారని సజ్జల చెప్పారు. పంచాయతీరాజ్‌ విభాగంలో ఉద్యోగులను తొలగించడంపై విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మూడు రాజధానులు రావడం ఖాయమని ఈ సందర్భంగా సజ్జల పునరుద్ఘాటించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు