Seethakka: జీవో నంబర్‌ 3 తెచ్చిందే కేసీఆర్‌ సర్కారు: సీతక్క

మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు.

Updated : 10 Mar 2024 14:51 IST

హనుమకొండ: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సర్కారు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారు మహిళలను అన్ని రంగాల్లోనూ ప్రోత్సహిస్తోందని చెప్పారు.

‘ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. భారాస అధికారంలోకి వస్తే తాను సీఎం కావాలని ఆమె భావించారు. పార్టీ ఓటమితో ఆశలన్నీ గల్లంతయ్యాయి. మహిళలను కాంగ్రెస్‌ నుంచి దూరం చేయాలని కవిత యత్నిస్తున్నారు. జీవో నంబర్‌ 3కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఆ జీవో ఇచ్చిందే కేసీఆర్‌ సర్కారు. భారాస తప్పుడు ప్రచారం బంద్‌ చేసి.. నిర్మాణాత్మక విపక్షంగా పనిచేయాలి’ అని సీతక్క తెలిపారు.

విద్య వైద్యానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేయూ భూమి కబ్జాకు గురికాకుండా ప్రహరీ నిర్మిస్తామన్నారు. భారాస సర్కార్‌ యువతను విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని