YS Sharmila: లండన్‌లో విహరిస్తోన్న జగన్‌కు ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు: షర్మిల

జగన్‌ పాలనలో మహిళల భద్రతకు సంబంధించి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు.

Published : 24 May 2024 21:14 IST

అమరావతి: జగన్‌ పాలనలో మహిళల భద్రతకు సంబంధించి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు. ‘‘నా అక్కలు, నా చెల్లెమ్మలు, నా తల్లులు,  నా అవ్వలు అంటూ మొసలి కన్నీరు కారుస్తారు. మైక్‌ల ముందు జగన్‌ ఫేక్‌ ప్రేమ నటిస్తారు. మీ పాలనలో మహిళల భద్రత, బ్రతుకులకు పట్టిన పీడ గురించి దేశమంతా చెప్పుకొంటోంది. లండన్‌ వీధుల్లో విహరిస్తోన్న జగన్‌కు ఇక్కడి ఆర్తనాదాలు వినిపించవు. రాష్ట్రానికి ఎందులో అత్యున్నత ర్యాంకులు రావాలో.. అందులో రావు. మీరు, మీ మహిళా మంత్రులు, నాయకురాళ్లు సిగ్గుతో తలవంచుకుంటారో.. మిన్నకుండిపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారు’’ అని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని