Shashi Tharoor: కాంగ్రెస్ నేత శశిథరూర్‌ మొత్తం ఆస్తుల విలువ రూ.55 కోట్లు

తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత శశి థరూర్ తన మొత్తం ఆస్తుల విలువ రూ.55 కోట్లుగా ప్రకటించారు.

Updated : 05 Apr 2024 17:26 IST

తిరువనంతపురం: తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ నేత శశిథరూర్ తన మొత్తం ఆస్తుల విలువ రూ.55 కోట్లుగా ప్రకటించారు. నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో థరూర్ తన ఆస్తులు, అప్పుల వివరాలను తెలియజేస్తూ తన వద్ద ప్రస్తుతం రూ.49 కోట్లకు పైగా స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఇందులో 19 బ్యాంకు ఖాతాలు, బాండ్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు ఉన్నాయన్నారు. చరాస్తులలో రూ.32 లక్షల విలువైన 534 గ్రాముల బంగారం, రూ.36,000 నగదు, మారుతీ సియాజ్, మారుతీ ఎక్స్‌ఎల్6 అనే రెండు కార్లు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కాగా థరూర్‌ ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లొమసీ (టఫ్ట్స్ యూనివర్శిటీ, యూఎస్ఏ) నుంచి లా అండ్ డిప్లొమసీలో పీహెచ్‌డీ చేశారు. యూఎస్ఏలోని పుగెట్ సౌండ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ పొందారు. కాగా ఈయన తొమ్మిది కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిలో నాలుగు కేసులకు సంబంధించి థరూర్‌ విచారణ ఎదుర్కొంటున్నట్లు అఫిడవిట్ పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని