Harish Rao: త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు: హరీశ్‌రావు

త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు సేవలు రానున్నాయని మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. సిద్దిపేటలో వీఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ను మంత్రి ప్రారంభించారు. 

Updated : 02 Oct 2023 16:16 IST

సిద్దిపేట: త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. సిద్దిపేటలో వీఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈసారి లక్షన్నర ఓట్ల మెజార్టీతో హరీశ్‌ రావును గెలిపించాలని ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు తీర్మానం చేశారు. మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌లో అన్నం పెట్టిన ఘనత సిద్దిపేట వైశ్యులదన్నారు. మంగళవారం నుంచి సిద్దిపేటకు రైలు సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నెల 5న సిద్దిపేటలో వెయ్యి పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సిద్దిపేటలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

రైలు వస్తున్న తరుణం..

3న 3 గంటలకు

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ - కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మార్గంలో కీలక ఘట్టం మంగళవారం ఆవిష్కృతం కానుంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌ వరకు పుష్‌పుల్‌ రైలు (డీజిల్‌ ఎలక్ట్రికల్‌ మల్టీపుల్‌ యూనిట్‌) సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 3న మధ్యాహ్నం 3 గంటల తరువాత ప్రధాని మోదీ నిజామాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. ఈ మార్గంలో రెండు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని