ప్రియాంక గాంధీ నివాసానికి.. సోనియా, రాహుల్‌

ఎన్నికల ఫలితాల సరళితో ఇప్పటికే పార్టీలు ఒక అంచనాకొచ్చాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేతలు సమావేశమయ్యారు. 

Published : 04 Jun 2024 15:53 IST

దిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగా కాకుండా ఫలితాల సరళిలో విపక్ష ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన చూపుతోంది. ఈ క్రమంలో కూటమి నేతల్లో సందడి కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఇంటికి ఆ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వారిద్దరూ విడివిడిగా ప్రియాంక నివాసానికి వెళ్లారు.

2019లో 52 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్.. ఈసారి దాదాపు 100 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి పార్టీలు కలిపి 190కి పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 56 స్థానాల్లో ముందున్నారు. తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ్ బెంగాల్‌, మహారాష్ట్ర వంటి పలు కీలక రాష్ట్రాల్లో ఇండియా కూటమి అభ్యర్థుల హవా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అగ్రనాయకులు సమావేశమవుతున్నారు. ఇదిలాఉంటే.. కేరళలోని వయనాడ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ పడిన రాహుల్‌ గాంధీ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. రాయ్‌బరేలీలో భాజపా అభ్యర్థి దినేశ్‌ ప్రతాప్‌ సింగ్‌పై 2.62 లక్షల ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. 2019లో ఈ స్థానం నుంచి సోనియా గాంధీ 1.67 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే తల్లిని మించి.. రాహుల్ భారీ తేడాతో విజయం దక్కించుకునేలా కనిపిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు