Gandhi Bhavan: సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. 78 కిలోల కేక్‌ను కట్‌ చేసిన సీఎం రేవంత్‌

కాంగ్రెస్‌ (Congress) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 09 Dec 2023 15:03 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) జన్మదినం రోజే గతంలో తెలంగాణ ప్రకటన వచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు. సోనియా గాంధీ 78వ పుట్టిన రోజు వేడుకలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

78 కిలోల కేక్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావుతో రేవంత్‌ కట్‌ చేయించారు. 6 గ్యారంటీ హామీల్లో రెండింటిని సోనియా పుట్టిన రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, వారి ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు.

ప్రధాని మోదీ శుభాకాంక్షలు..

సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని