జగన్‌ ప్రభుత్వంపై వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై వైకాపా బీసీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Updated : 12 Feb 2024 15:47 IST

అమరావతి: వైకాపా ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఆ పార్టీ బీసీ సెల్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపాలో సామాజిక న్యాయం నేతిబీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. ‘‘బీసీలకు పదవులు ఇచ్చారు తప్ప.. అధికారాలు లేవు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేసే పరిస్థితి పార్టీలో లేదు. కీలక పదవులన్నీ ఒకే సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. బీసీ వర్గాలు వైకాపాకు దూరమవుతున్నాయి. వాళ్లకు ప్రోటోకాల్‌ పాటించట్లేదు. బీసీలు ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. సీఎం జగన్‌ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ మాటలేగానీ.. వారి మనోగతం అర్థం చేసుకోవట్లేదు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి తీసుకొచ్చారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారు’’ అని విమర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు