Chandrababu Arrest: కక్షసాధింపు రాజకీయాలకు వేదికగా ఏపీ: సీపీఐ రామకృష్ణ

చంద్రబాబు అరెస్ట్‌ (Chandrababu Arrest) నేపథ్యంలో రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు. తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపుతామని చెప్పారు.

Updated : 10 Sep 2023 13:18 IST

తిరుపతి: చంద్రబాబు అరెస్ట్‌ (Chandrababu Arrest) నేపథ్యంలో రేపు విజయవాడలో అన్ని పక్షాలతో సమావేశం నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) తెలిపారు. తర్వాత చంద్రబాబును కలిసి సంఘీభావం తెలుపుతామని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కక్షసాధింపు రాజకీయాలకు రాష్ట్రం వేదికగా మారిందని ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధి కంటే సీఎం జగన్‌కు ప్రతీకారం తీర్చుకోవడమే ప్రాధాన్యమైపోయిందని దుయ్యబట్టారు. 

సీఐడీ తీరుపైనా రామకృష్ణ (CPI Ramakrishna) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ జగన్‌ ప్రైవేట్‌ సైన్యంగా వ్యవహరిస్తోందన్నారు. రెండేళ్ల నుంచి చంద్రబాబును విచారణకు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. పోలీసుల రాజ్యంలో విలువలు పతనమవుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని