Jyotiraditya Scindia: పెద్ద నాయకులు యూపీలో గెలిచింది ఒక్క సీటే.. ప్రియాంక వ్యాఖ్యలపై సింధియా

ప్రియాంక గాంధీ తనపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీటుగా బదులిచ్చారు. అదే విధంగా మధ్యప్రదేశ్‌ సీఎం అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు.

Updated : 17 Nov 2023 16:35 IST

గ్వాలియర్‌: కాంగ్రెస్‌ (Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తనపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) దీటుగా బదులిచ్చారు. తమని తాము పెద్ద నాయకులుగా భావించేవాళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌ ( UP)లో ఒక్క సీటు మాత్రమే గెలిచారని గుర్తుచేశారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. శుక్రవారం మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని గ్వాలియర్‌లో ఓటు హక్కు ఉపయోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 

‘‘కొంతమంది నాయకులు తమని తాము పెద్ద లీడర్లుగా భావిస్తున్నారు. కానీ, వాళ్లు యూపీలో 80 స్థానాలకు ఒక్కచోటే గెలిచారు. ఆ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయారు. నన్ను ఇబ్బందిపెట్టాలని వాళ్లు ఈ విషయాన్ని మర్చిపోయినట్లున్నారు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. ఆమె (ప్రియాంక గాంధీని ఉద్దేశించి) చేసిన వ్యాఖ్యలకు నేను బదులిచ్చాను. ప్రజలకు మంచి చేసేందుకు దేవుడు మనకు తక్కువ సమయం ఇచ్చాడు. కాబట్టి ప్రజల ప్రేమ, నమ్మకాన్ని గెలుచుకోవాలి’’ అని సింధియా వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల క్రితం మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో భాగంగా సింధియాపై ప్రియాంక గాంధీ ఘాటు విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌ ప్రజల విశ్వాసాన్ని సింధియా వమ్ము చేశారన్న ఆమె.. ఎత్తు తక్కువే అయినప్పటికీ అహంకారంలో మాత్రం తక్కువ కాదన్నట్లు విమర్శించారు. 

‘డీప్‌ఫేక్‌’ ఆందోళనకరం.. మోదీ కీలక వ్యాఖ్యలు

సీఎం రేసులో లేను

మధ్యప్రదేశ్‌ సీఎం పదవి రేసులో తాను లేనని సింధియా స్పష్టం చేశారు. ‘‘2103, 2018లో నన్ను ఇదే ప్రశ్న అడిగారు. ఇప్పుడు అదే అడుగుతున్నారు. దీని గురించి ఇప్పటికే నేను స్పష్టత ఇచ్చాను. సీఎం అభ్యర్థిత్వం కోసం నేను పోటీ పడటంలేదు’’ అని సింధియా తెలిపారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. మా పనితీరుకు రాష్ట్రంలో అభివృద్ధే నిదర్శనం. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో భాజపా తప్పక గెలుస్తుందన్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. డిసెంబరు 3న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని