Telangana News: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక.. తమిళిసై ఆమోదం

తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు.

Updated : 25 Jan 2024 16:40 IST

హైదరాబాద్: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్ కుమారుడు మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని