Tamilisai Soundararajan: నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లు.. సిఫార్సులు తిరస్కరించిన తమిళిసై

నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించారు.

Updated : 25 Sep 2023 16:46 IST

హైదరాబాద్‌: నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించారు. నామినేటెడ్‌ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను గవర్నర్‌ తిరస్కరించారు. కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌ పేర్లను మంత్రి మండలి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. నామినేటెడ్ కోటా కింద సిఫార్సు చేసిన అభ్యర్థులకు తగిన అర్హతలు లేవని గవర్నర్‌ పేర్కొన్నారు. ఆర్టికల్ 171 (5) ప్రకారం అర్హతలు సరిపోవని తమిళిసై అన్నారు.

‘‘తగిన అర్హతలు లేకుండా నామినేట్ చేయడం తగదు. అర్హతలు ఉన్న ఎంతో మంది ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నారు. అర్హులను పరిగణనలోకి తీసుకోకుకుండా రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లు సిఫార్సు చేయడం సరైనది కాదు. ఇలా చేస్తే ఆయా రంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం, అనుభవం ఉన్న వారికి గుర్తింపు లభించబోదు. సరైన వ్యక్తులకు అవకాశాలు నిరాకరించినట్లవుతుంది. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయకూడదో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది. మంత్రివర్గ సిఫార్సులో అన్ని అంశాలను జత చేయలేదు’’ అని గవర్నర్‌ వెల్లడించారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను తిరస్కరించాలని ఈ సందర్భంగా మంత్రి మండలి, ముఖ్యమంత్రికి సూచించినట్లు గవర్నర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు