Atchannaidu: సజ్జలను తొలగించండి.. ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Published : 25 Mar 2024 15:56 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గత ఐదేళ్ళుగా ప్రభుత్వ సలహాదారుడిలా కాకుండా వైకాపా కార్యకర్తలా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టి విపక్షాలపై ఆరోణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకుగానూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే వెంటనే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని