BJP: ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా.. తెలంగాణ భాజపా పావులు

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి రావాలంటే ఈ నియోజకవర్గాల్లో సింహభాగం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

Updated : 11 Aug 2023 12:17 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. అధికారంలోకి రావాలంటే ఈ నియోజకవర్గాల్లో సింహభాగం గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో రిజర్వ్ నియోజకవర్గాల నేతలతో.. రాష్ట్ర ఇంఛార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో భాజపా విజయం సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు భాజపా అండగా ఉంటుందనే భరోసా ఈ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జావడేకర్‌, సహ ఇంఛార్జి అరవింద్ మీనన్, కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వీరితో సమావేశం కానున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని