TS High Court: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది.

Updated : 30 Jan 2024 15:49 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు (TS High Court) బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ (Kodandaram), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ (Mir Ameer Ali Khan) ఎమ్మెల్సీలుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయించవద్దని కోర్టు ఆదేశించింది.

ఎమ్మెల్సీలుగా తమ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించడాన్ని భారాస నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్‌ చేశారు. మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను ఆమె తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణస్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. స్టేటస్‌ కో విధిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని