Telangana Ministers: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల ప్రమాణస్వీకారం

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

Updated : 07 Dec 2023 15:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం, మంత్రులతో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. తొలుత సీఎంగా రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు.

1. మల్లు భట్టి విక్రమార్క (మధిర నియోజకవర్గం)

  • విద్యార్హతలు: బీఏ
  • ఎమ్మెల్సీ: 2007 నుంచి 2009
  • ఎమ్మెల్యే: 2009, 2014, 2019, 2023
  • పదవులు: ప్రభుత్వ విప్‌, ఉప సభాపతి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీఎల్పీ నేత

2. ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (హుజూర్‌నగర్‌ నియోజకవర్గం)

  • విద్యార్హత: బీఎస్సీ
  • భారత వైమానిక దళంలో మాజీ ఫైటర్‌ పైలట్‌
  • రాజకీయ అరంగేట్రం: 1994
  • ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2014, 2018, 2023
  • ఎంపీ: 2009 (నల్గొండ)
  • పదవులు: గృహ నిర్మాణ శాఖ మంత్రి, 2004లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, 2015 పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు

3. దామోదర రాజనర్సింహ (ఆందోల్ నియోజకవర్గం)

  • 1989లో రాజకీయ అరంగేట్రం
  • ఎమ్మెల్యే: 1999, 2004,2009, 2023
  • పదవులు: ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి

4. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి (నల్గొండ నియోజకవర్గం)

  • విద్యార్హత: ఇంజినీరింగ్‌
  • ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2014
  • ఎంపీ: 2019 (భువనగిరి)
  • అనుభవం: ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన మంత్రి

5. దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు (మంథని నియోజకవర్గం)

  • విద్యార్హత: ఎం.ఎ, ఎల్‌.ఎల్‌.బి
  • రాజకీయ అరంగేట్రం: 1999
  • ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2018, 2023
  • పదవులు: పౌరసరఫరాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి

6. పొంగులేటి  శ్రీనివాస్‌ రెడ్డి (పాలేరు నియోజకవర్గం)

  • విద్యార్హతలు: దూరవిద్యలో డిగ్రీ, ఎల్‌.ఎల్‌.బి
  • రాజకీయ అరంగేట్రం: 2013లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌
  • 2014లో వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు
  • 2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గెలుపు
  • 2016లో తెరాసలో చేరిక
  • 2023లో కాంగ్రెస్‌లో చేరిక

7. పొన్నం ప్రభాకర్‌ (హుస్నాబాద్‌ నియోజకవర్గం)

  • విద్యార్హతలు: ఎం.ఏ, ఎల్‌.ఎల్‌.బి
  • ఎంపీ: కరీంనగర్‌ (2009-14)
  • అనుభవం: ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌

8. కొండా సురేఖ (వరంగల్‌ తూర్పు నియోజకవర్గం)

  • విద్యార్హత: బీకాం
  • రాజకీయ అరంగేట్రం: 1995లో మండల పరిషత్‌ ప్రెసిడెంట్‌
  • ఎమ్మెల్యే: 1999, 2004, 2009, 2023
  • పదవులు: మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి
  • 2014లో తెరాసలో చేరిక
  • 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరిక

9. దనసరి అనసూయ (సీతక్క) (ములుగు నియోజకవర్గం)

  • విద్యార్హతలు: పీహెచ్‌డీ
  • 1996 వరకు మావోయిస్టుగా అడవి జీవితం
  • రాజకీయ అరంగేట్రం: 2004లో తెదేపాలో చేరిక
  • ఎమ్మెల్యే: 2009, 2019, 2023
  • 2017లో కాంగ్రెస్‌లో చేరిక
  • పదవులు: ఏఐసీసీ కాంగ్రెస్‌ మహిళా కార్యదర్శి

10. తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం నియోజకవర్గం)

  • విద్యార్హత: డిగ్రీ
  • 1978లో రాజకీయ అరంగేట్రం
  • ఎమ్మెల్యే: 1985, 1994, 1999, 2009, 2014, 2023
  • పదవులు: భారీ నీటిపారుదల, చిన్న నీటిపారుదల మంత్రి, రోడ్లు, భవనాలు, మహిళా శిశు సంక్షేమం, ఆబ్కారీ శాఖ మంత్రి
  • 2014లో తెరాసలో చేరిక
  • 2015లో ఎమ్మెల్సీ

11. జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌ నియోజకవర్గం)

  • ఎమ్మెల్యే: 2004, 2009, 2012, 2014
  • పదవులు: ఆహార, పౌరసరఫరాల శాఖ, దేవాదాయ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
  • 2011లో తెరాసలో చేరిక
  • 2023లో కాంగ్రెస్‌లో చేరిక
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు