Yuvagalam: తుపాను ఎఫెక్ట్‌.. యువగళం పాదయాత్రకు తాత్కాలిక విరామం

మిగ్‌జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయత్రికు తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్‌ వెల్లడించారు.

Published : 04 Dec 2023 10:28 IST

పిఠాపురం: మిగ్‌జాం తుపాను నేపథ్యంలో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినందున పాదయాత్రకు మూడు రోజుల విరామం ఇస్తున్నట్లు నేతలు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి తీరంలో పొన్నాడ శీలంవారిపాకల వద్దకు యువగళం పాదయాత్ర చేరింది. తుపాను కారణంగా ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పాదయాత్రకు బ్రేక్‌ పడింది. తుపాను ప్రభావం తగ్గాక ఈనెల 7న మళ్లీ శీలంవారిపాకల నుంచి ‘యువగళం’ ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని