Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు?

ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Updated : 05 Jun 2024 20:26 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 12న ఆయన ప్రమాణం  చేయనున్నారు. ఈనెల 9న నరేంద్రమోదీ.. ప్రధానిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆ తర్వాతే చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది. ఈనెల 7న మరోసారి ఎన్డీయే సమావేశం జరగనుంది. ఈ భేటీకి కూటమిలోని ఎంపీలంతా హాజరు కానున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.  ఆరోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. 9న సాయంత్రం కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు