Konda vishweshwar reddy: దేశంతోపాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచింది: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో దేశంతోపాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశర్‌రెడ్డి అన్నారు.

Updated : 06 Jun 2024 18:55 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో దేశంతోపాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘పోలీసులు బాగా పనిచేయడం వల్లే లోక్‌సభ ఎన్నికలు నిజాయతీగా జరిగాయి. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పని చేయలేదు. మెదక్‌లో రూ. కోట్లు ఖర్చు చేసినా భారాస గెలవలేదు. ఇదే ఊపుతో సర్పంచ్‌, స్థానిక సంస్థలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పని చేస్తాం. రాబోయే రోజుల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయం. అయితే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సహకరిస్తూనే ముందుకు సాగుతాం. పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్రాభివృద్ధికి పాటుపడతాం. భారాస రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వెళ్లిపోయింది’’ అని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని