Political families: భార్యాభర్తలు ఓడారు.. బావ, బావ మరుదులు గెలిచారు!

ఏపీ ఎన్నికల సమరంలో పలువురు అన్నదమ్ములు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు బరిలో నిలిచారు.

Updated : 05 Jun 2024 07:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ ఎన్నికల సమరంలో పలువురు అన్నదమ్ములు, భార్యాభర్తలు, అన్నాచెల్లెళ్లు బరిలో నిలిచారు. తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే, ఎంపీలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరు ఓడిపోగా.. మరి కొందరు గెలిచారు. ఆ వివరాలు ఇవీ..

అన్నదమ్ములు

వైకాపా నుంచి బరిలో నిలిచిన ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం), ధర్మాన కృష్ణదాస్‌ (నరసన్నపేట), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బొత్స అప్పల నరసయ్య (గజపతినగరం) అంబటి రాంబాబు (సత్తెనపల్లి), అంబటి మురళి (పొన్నూరు),  వై. వెంకట్రామిరెడ్డి(గుంతకల్లు), వై. సాయిప్రసాద్‌రెడ్డి (ఆదోని) ఓటమి చెందగా.. మంత్రాలయంలో వీరి సోదరుడు వై. బాలనాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. కూటమి అభ్యర్థిగా భాజపా టికెట్‌పై రాజంపేటలో పోటీ చేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి (ఎంపీ) ఓడిపోగా ఆయన సోదరుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి (పీలేరు) తెదేపా ఎమ్మెల్యేగా గెలుపొందారు. తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి వైకాపా ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేశారు.

అన్నా చెల్లెళ్లు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (పులివెందుల) గెలవగా.. ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (కడప) ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

తండ్రీ కొడుకులు

  • కుప్పంలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, మంగళగిరిలో ఆయన తనయుడు నారా లోకేశ్‌ గెలుపొందారు.
  • పుంగనూరులో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీగా ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి గెలిచారు.  

బాబాయ్‌- అబ్బాయ్‌

  • తాడిపత్రిలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోయారు.
  • టెక్కలిలో తెదేపా అభ్యర్థి కింజరపు అచ్చెన్నాయుడు.. శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్‌నాయుడు విజయం సాధించారు.
  • జమ్మలమడుగులో భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి గెలవగా.. కడప ఎంపీ స్థానంలో తెదేపా అభ్యర్థి భూపేశ్‌రెడ్డి ఓడిపోయారు.

భార్యాభర్తలు 

  • చీపురుపల్లిలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీగా బరిలో నిలిచిన బొత్స ఝాన్సీ ఇద్దరూ పరాజయం పాలయ్యారు.

మామ- అల్లుళ్లు 

  • హిందూపురంలో తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, మంగళగిరిలో నారా లోకేశ్‌, విశాఖ ఎంపీగా భరత్‌ గెలుపొందారు.
  • ఆమదాలవలసలో తమ్మినేని సీతారాంపై తెదేపా అభ్యర్థి కూన రవికుమార్‌ పైచేయి సాధించారు.
  • కమలాపురంలో వైకాపా అభ్యర్థి రవీంద్రనాథ్‌రెడ్డి ఓడిపోగా పులివెందులలో వైఎస్‌ జగన్‌ గెలిచారు.

బావ - బావమరిది

  • కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ గెలుపొందారు.
  • రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు, శ్రీకాకుళం ఎంపీగా కింజరపు రామ్మోహన్‌నాయుడు విజయం సాధించారు.
  • ధర్మవరంలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జమ్మలమడుగులో సుధీర్‌రెడ్డి ఓడిపోయారు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని