Anam Venkata Ramana Reddy: కుంభకోణం జరగలేదని తితిదే ఛైర్మన్‌ ప్రమాణం చేయగలరా?: ఆనం

ఆంధ్రప్రదేశ్‌లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్‌ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు.

Updated : 08 Dec 2023 17:30 IST

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో ₹వేల కోట్ల అభివృద్ధి హక్కు పత్రాల(టీడీఆర్‌ బాండ్లు) కుంభకోణం జరిగిందని తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ₹45వేల కోట్ల నుంచి ₹50 వేల కోట్ల వరకు కుంభకోణం జరిగిందన్నారు. ఒక్క తిరుపతిలోనే ₹4,052 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. 

‘‘ఈ అవినీతి బాగోతంలో తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy), ఆయన కుమారుడే సూత్రధారులు. వ్యవసాయ భూములన్నీ కమర్షియల్‌గా చూపించి దోచుకున్నారు. ఒక్క టీడీఆర్‌ బాండ్‌కు కూడా ఈసీలు లేవు. డీకేటీ పట్టాలు, దొంగ జీపీలతో దోచుకున్నారు. ఈసీలు తీస్తే బండారం బయపడుతుంది. తండ్రి, కుమారుడు కుంభకోణం జరగలేదని ప్రమాణం చేయగలరా? శ్రీవారి నిజరూప దర్శనం రోజు కోనేటిలో మునిగి ప్రమాణం చేస్తారా? తెదేపా(TTD) ఎన్నిసార్లు ఆర్టీఏ కింద సమాచారం కోరినా ఇవ్వలేదు. మీరు సమాచారం ఇవ్వకున్నా మేము తెచ్చుకోగలం’’ అని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని