Senthil Balaji: మంత్రి సెంథిల్‌ బాలాజీని బర్తరఫ్‌ చేసిన గవర్నర్‌.. ఆ హక్కులేదన్న సీఎం స్టాలిన్‌

Tamil nadu Politics: తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ ఆదేశాలు జారీచేశారు.

Updated : 29 Jun 2023 21:02 IST

చెన్నై: ఇటీవల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీకి గవర్నర్‌ గట్టి షాక్‌ ఇచ్చారు. ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేస్తూ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆదేశాలు జారీ చేశారు. సెంథిల్‌ బాలాజీ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే సెంథిల్‌ బాలాజీ మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. ఉద్యోగాలు అమ్ముకోవడంతో సహా సెంథిల్‌ బాలాజీపై పలు తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, మంత్రిగా ఉంటే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజ్‌భవన్‌ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణమే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

గవర్నర్‌కు ఆ హక్కులేదు.. సీఎం స్టాలిన్‌

తన మంత్రివర్గ సహచరుడు సెంథిల్‌ను గవర్నర్‌ బర్తరఫ్‌ చేయడంపై సీఎం స్టాలిన్‌ స్పందించారు. గవర్నర్‌ రవి తీరును తప్పుబట్టారు. గవర్నర్‌కు ఆ హక్కులేదని.. ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని