JD Lakshminarayana: వాలంటీర్లను బదిలీ చేస్తేనే ఎన్నికల్లో పారదర్శకత: జేడీ లక్ష్మీనారాయణ

ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలంటే వాలంటీర్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయాలని జైభారత్‌ నేషనల్‌ పార్టీ నాయకుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

Published : 01 Apr 2024 21:08 IST

అమరావతి: వాలంటీర్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాకు జై భారత్‌ నేషనల్‌ పార్టీ, లిబరేషన్‌ కాంగ్రెస్‌ నేతలు జేడీ లక్ష్మీనారాయణ, విజయ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని కోరారు. అనంతరం జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కెమెరాలు పెట్టాలని, వాలంటీర్లు, మెప్మా సిబ్బందిని బదిలీ చేయాలని కోరామని అన్నారు.

‘‘మద్యం దుకాణాల్లో డిజిటల్‌ చెల్లింపులు జరగాలి. సస్పెండైన వాలంటీర్లు వైకాపాకు పని చేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందిన వాలంటీర్లను వేరే ప్రాంతాలకు పంపాలి. ఉదాహరణకు ఉత్తరాంధ్రకు చెందిన వారిని రాయలసీమ జిల్లాలకు పంపాలి. వాలంటీర్లు స్థానికంగా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవు’’ అని లక్ష్మీనారాయణ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని