TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ

తెలంగాణ 3వ శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది.

Updated : 08 Dec 2023 17:49 IST

హైదరాబాద్‌: తెలంగాణ 3వ శాసనసభ శనివారం ఉదయం 11గంటలకు సమావేశం కానుంది. ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్‌ నియామకంపై రాజ్‌భవన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని