TS High Court: మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌.. కొట్టేసిన హైకోర్టు

మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ.. సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని హైకోర్టులో అంజిరెడ్డి అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 18 Nov 2023 14:33 IST

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మల్లారెడ్డి అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ.. సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని హైకోర్టులో అంజిరెడ్డి అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. మల్లారెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. అయితే, అఫిడవిట్‌లో అభ్యంతరాలపై ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్లు ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని