Tummala Nageswara Rao: ప్రకృతి వైపరీత్యాలను ప్రభుత్వ వైఫల్యంగా చూపడం దారుణం: తుమ్మల

ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Updated : 31 Mar 2024 23:33 IST

హైదరాబాద్‌: ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రతిపక్ష నేత కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుబంధు పేరుతో వ్యవసాయానికి సంబంధించిన పథకాలన్నీ ఎత్తివేసి చిన్న, సన్నకారు రైతులను కోలుకోలేని దెబ్బతీశారని మండిపడ్డారు.

వర్షాకాలం తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. నాగార్జున సాగర్‌లో నీళ్లు లేని కారణంగా మొదటి పంటకే నీళ్లివ్వని భారాస నేతలు.. రెండో పంటకి నీరివ్వాలని హేతుబద్దత లేని డిమాండ్ చేయడం దారుణమన్నారు. గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన రైతులకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పి.. 1000 పైసలైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. పంటల బీమా పథకాన్ని ఎత్తేసి అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి రైతుల నోట్లో మట్టికొట్టారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని