Uttam: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారం: మంత్రి ఉత్తమ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

Published : 26 May 2024 17:28 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. తాలు, తరుగు విషయంలో అవకతవకలకు పాల్పడితే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సన్నబియ్యం కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని, రూ.42కు సన్నబియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తుందని చెప్పారు. సన్నబియ్యంపై ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని, దీనిపై టెండర్‌ పెట్టి రద్దు చేశామని అన్నారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, 1.30 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారని ఉత్తమ్‌ మండిపడ్డారు. ‘‘ నాపై బాధ్యతారహితమైన ఆరోపణలు చేస్తున్నారు. గతప్రభుత్వంలో క్వింటా ధాన్యం ధర రూ.1700గా ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక క్వింటా ధాన్యం రూ. 2007 పలికింది. మా ప్రభుత్వంలో రైతులకు రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది’’ అని ఉత్తమ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని