TS Ministers: మంత్రులకు శాఖల కేటాయింపు.. సోషల్‌ మీడియాలో ప్రచారం!

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులకు శాఖలు కేటాయించినట్టు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, దీనిపై ఇంతవరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

Updated : 07 Dec 2023 22:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్‌ రెడ్డి సీఎంగా, 11మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్త మంత్రులకు సీఎం పలు శాఖలు కేటాయించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన మంత్రుల శాఖలు వివరాలు ఇలా ఉన్నాయి..

  • డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి - భట్టి విక్రమార్క 
  • హోం మంత్రి- ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 
  • మున్సిపల్‌ శాఖ మంత్రి - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 
  • ఆర్థికశాఖ మంత్రి - డి.శ్రీధర్‌బాబు 
  • నీటి పారుదలశాఖ మంత్రి - పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 
  • మహిళా సంక్షేమశాఖ మంత్రి - కొండా సురేఖ 
  • వైద్య ఆరోగ్యశాఖ మంత్రి - దామోదర రాజనర్సింహ 
  • పౌరసరఫరాలశాఖ మంత్రి - జూపల్లి కృష్ణారావు
  • బీసీ సంక్షేమశాఖ మంత్రి - పొన్నం ప్రభాకర్‌
  • గిరిజన సంక్షేమశాఖ మంత్రి - సీతక్క
  • రోడ్లు, భవనాల శాఖ మంత్రి - తుమ్మల నాగేశ్వరరావు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని