Kishan Reddy: ఇన్నాళ్లు విచారణకు కవిత సహకరించలేదు: కిషన్‌రెడ్డి

భారాస ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. 

Published : 15 Mar 2024 20:35 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. నేరం చేయనప్పుడు కవితకు భయమెందుకని ప్రశ్నించారు. ఈడీ విచారణకు కవిత సహకరించాలని సూచించారు. ఇన్నాళ్లు విచారణకు సహకరించకుండా కవిత తప్పించుకుని తిరిగారని విమర్శించారు. సహకరించలేదు కాబట్టే.. ఈడీ ఆమె ఇంటికి వెళ్లిందన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగాల్సిన అవసరం భాజపాకు లేదని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. విచారణ సంస్థలు తమ పని తాము చేసుకునిపోతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని