Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు ముఖ్యమైనదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు ముఖ్యమైనదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
‘‘ఈ సంవత్సరం అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ప్రజలు ఉగాది పర్వదినం సందర్భంగా ఓ నిర్ణయం తీసుకోవాలి. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఆశీర్వదించి.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలి. ఈరోజు నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని సందర్శనశాలగా మారుస్తున్నాం. దీన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా ప్రారంభిస్తారు. 11నెలల పాటు రాష్ట్రపతి నిలయం సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ నెల తప్ప మిగతా రోజుల్లో సామాన్యులకు అందుబాటులో ఉండదు’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
-
Ts-top-news News
ప్రశ్నపత్రాల లీకేజీలో త్వరలో మూకుమ్మడి అరెస్టులు
-
Sports News
సాకర్ బాటలో క్రికెట్!.. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్