Uttam Kumar Reddy: 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా..: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి 50వేల మెజార్టీతో గెలుస్తానని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated : 24 Oct 2023 17:42 IST

సూర్యాపేట: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి 50వేల మెజార్టీతో గెలుస్తానని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. ఉత్తమ్‌ సమక్షంలో పలువురు భారాస నేతలు మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చే వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. సమన్వయంతో పని చేసి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని