Uttam Kumarreddy: భారాసలో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు: ఉత్తమ్‌

తాను భారాసలో చేరుతున్నట్ల సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. 

Published : 29 Jul 2023 19:02 IST

హైదరాబాద్: తాను భారాసలో చేరుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న ఓ నేత ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో తన స్థానాన్ని తగ్గించేందుకు ఇలాంటి ప్రచారం చేయడం సరి కాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన సహచరులు, అనుచరులను అణగదొక్కేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలతో అసంతృప్తిగా ఉండొచ్చు.. అయినప్పటికీ పార్టీ అంతర్గత విషయాలపై మీడియాతో, ఫోరమ్‌లలో మాట్లాడనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వ్యాపారాలు, ఒప్పందాలు, భూ లావాదేవీలు లేవని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని