Uttam: పార్టీ పోటీ చేయొద్దంటే చేయను: ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఏఐసీసీని కోరతానని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. టికెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగం పెంచుతామన్నారు. 

Updated : 30 Aug 2023 17:08 IST

హైదరాబాద్: భారాస ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేయలేదని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బుధవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌ వస్తే పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేస్తాం. నేను హుజూర్‌నగర్‌, నా భార్య కోదాడ టికెట్‌ కోసం దరఖాస్తు చేశాం. త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఏఐసీసీని కోరతా. టికెట్లు తొందరగా ప్రకటిస్తే ప్రచార వేగం పెంచుతాం. వామపక్షాలతో చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియదు. హుజూర్‌నగర్‌, కోదాడలో మెజారిటీ 50వేలు కంటే తగ్గదు. 50వేలు కంటే మెజారిటీ తగ్గితే మళ్లీ రాజకీయాలు చేయను. పార్టీ పోటీ చేయొద్దంటే చేయను. ఎంపీ ప్రతిపాదన వస్తే అప్పుడు చూద్దాం. గడిచిన ఆరు నెల్లలో పార్టీ బాగా బలపడింది. భారాసను దీటుగా ఎదుర్కొంటాం. ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో క్లీన్ స్వీప్ చేస్తాం’’ అని ఉత్తమ్‌ అన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని