నాకంటే కష్టపడిన వాళ్లు ఉన్నారా? ఖమ్మం నుంచే పోటీ చేస్తా: వీహెచ్‌

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు.

Published : 26 Feb 2024 17:20 IST

హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, అక్కడి ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేసినట్లు తెలిపారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారని.. పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకముందని పేర్కొన్నారు. తానేం తప్పు చేశానని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన నాయకులు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలన్నారు. భాజపా నేతలు తమ భాషను మార్చుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని