Jaleel Khan: తెదేపాలోనే కొనసాగుతా: మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌

మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు.

Published : 29 Feb 2024 14:02 IST

అమరావతి: మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ గురువారం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. విజయవాడ తెదేపా లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌ కేశినేని చిన్ని ఆయన్ను లోకేశ్‌ వద్దకు తీసుకెళ్లారు. తాను తెదేపాలోనే కొనసాగుతానని ఈ సందర్భంగా జలీల్‌ఖాన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగడతానని.. పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుకు లోకేశ్‌ హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని